ఇంటర్వ్యూ : రష్మిక మండన్నా – నాకు సక్సెస్ రావటానికి అది కూడా ఒక కారణమే.

Published on Feb 16, 2020 6:12 pm IST

‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. కాగా ఈ సందర్భంగా ఈ చిత్ర హీరోయిన్ రష్మిక మండన్నా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

వాలెంటైన్స్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ?

ఈ వాలెంటైన్స్ డే నాకు చాల బోర్ గా సాగింది. ఒక రొమాంటిక్ సినిమా చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే 30 మినిట్స్ కే ఆ సినిమా బోర్ కొట్టేసింది. ఆ మూవీ ఇంగ్లీష్ మూవీలేండి… మళ్ళీ ఏ తెలుగు మూవీ అని అడుగుతారు.

 

మీరు చాల తక్కువ టైంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఇది మీ లక్ అనుకోవచ్చా ?

మంచి స్క్రిప్ట్ లను చూజ్ చేసుకోవాలి, ఆ స్క్రిప్ట్ లో క్యారెక్టర్ కు తగ్గట్టు కష్టపడి బాగా చేయాలి.. ఇవ్వన్నీ లక్ వల్ల రావు కదా. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే అది నా హార్డ్ వర్క్ వల్లే.

 

స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఛాన్స్ లు తెచ్చుకుంటున్నారు. మీలో ఏమి మార్పులు వచ్చాయి ?

మార్పులు ఏమి లేవు అండి. వచ్చినపుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. స్టార్ హీరోలతో చేస్తున్నాను కాబట్టి ఇక ప్రత్యేకమైన కేర్ కూడా ఏమి తీసుకోను. నాకు నచినట్టే చేస్తూ వస్తున్నాను.

 

పెద్ద హీరోలతో చేస్తున్నాను అనే ఉద్దేశ్యంతో కొన్ని చిన్న సినిమాలు రిజెక్ట్ చేస్తున్నారట ?

నేను ఇప్పటివరకూ ఏభై స్క్రిప్ట్స్ దాకా రిజెక్ట్ చేసి ఉంటాను. మంచి కథను ఎప్పుడూ వదులుకోలేదు. ఇంత తక్కువ టైంలోనే నాకు సక్సెస్ వచ్చిందంటే బాగాలేని స్క్రిప్ట్ లను రిజక్ట్ చేయడం కూడా ఒక కారణమే.

 

‘సరిలేరు నీకెవ్వరు’లో మీ క్యారెక్టర్ కు మీ యాక్టింగ్ కు చాల విమర్శలు వచ్చాయి. ఎలా అనిపించింది ?

అవునా.. నేను అలాంటి విమర్శలను వినలేదే. అయినా ఆ సినిమాలో నా క్యారెక్టర్ కు తగ్గట్లు కొన్ని చోట్ల ఓవర్ గా రియాక్ట్ అవ్వాలి. అందుకే అలా చేయాల్సి వచ్చింది. ఇక విమర్శలు కూడా ఎదగడానికి ఉపయోగపడతాయి కదా. వాటిని నేను అంగీకరిస్తాను.

 

‘భీష్మ’లో రష్మిక నుండి ఆడియన్స్ ఏమి ఆశించొచ్చు ?

 

‘భీష్మ’లో నా క్యారెక్టర్ చాల బాగుంటుంది. నేను చేసిన డాన్స్, నా యాక్టింగ్ కూడా బాగా వచ్చాయి. అన్నిటికి మించి సినిమాలో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ ఫన్ ను బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు.

 

ఇంతకీ సినిమాలో ‘భీష్మ’ అంటే ఎవరు ?

సినిమాలో భీష్మ నితిన్ గారే. అయితే సినిమాలో ఆయన భీష్మగా ఏమి చేశారు, మిగతా కథ ఏమిటి అనేది మాత్రం సినిమా చూసే తెలుసుకొండి.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

ప్రస్తుతం భీష్మ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇక మార్చి మిడిల్ నుండి సుకుమార్ అండ్ బన్నీ సినిమా చేయబోతున్నాను. అలాగే తమిళ్ లో కార్తితో ఒక సినిమా చేస్తున్నాను.

సంబంధిత సమాచారం :

More