ఎన్టీఆర్ కి హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ ?

Published on Mar 1, 2021 6:00 pm IST

ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అలవైకుంఠపురములో’ వంటి హిట్ చిత్రాల తరువాత, త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని కూడా మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వినిపించాయి. మొదట జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేయనున్నారని అన్నారు. మళ్ళీ పూజా హెగ్డే అయితే బాగుంటుందని త్రివిక్రమ్ ఫీల్ అవుతున్నాడని ఆ తరువాత వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ సినిమాలో కూడా రష్మిక మండన్నానే హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఏది ఏమైనా ఇప్పుడు స్టార్ హీరోలు, మీడియమ్ రేంజ్ హీరోలు కొత్త సినిమా అనుకుంటున్నారు అనగానే ముందుగా కథానాయికల లిస్టులో రష్మిక మందన్న పేరు చేరిపోతోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. చూడాలి ఈ సినిమాలో ఎవర్ని హీరోయిన్ గా తీసుకుంటారో.

కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టాలనుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :