రొమాంటిక్ సన్నివేశాల్లో రష్మిక !

Published on May 9, 2019 3:32 pm IST

యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసందే. కాగా తాజాగా ఈ చిత్రం నుండి ఓ ఆసక్తి కరమైన అప్ డేట్ తెలిసింది. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువు ఉంటాయట, పైగా లిప్ కిస్ లు కాస్త ఘాటుగానే ఉంటాయని తెలుస్తోంది. రొమాంటిక్ సన్నివేశాల్లో రష్మిక ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా.. చాలా బాగా నటించిందట.

ఇక జూలై 26న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం అన్ని సౌత్ భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రంలో విజయ్ మెడికల్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్నీ మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. ఇక విజయ్ ప్రస్తుతం ఈ చిత్రంతోపాటు క్రాంతి మాధవ్ తెరక్కిస్తున్న కొత్త చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More