కొత్త సెట్‌లోకి అడుగుపెట్టిన రష్మిక..!

Published on Jul 20, 2021 2:00 am IST

నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే మొన్నటి వరకు “పుష్ప” సెట్‌లో కనిపించిన ఈ బ్యూటీ తాజాగా కొత్త సెట్ మీదకు వచ్చేసింది. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరక్కుతున్న “ఆడాళ్లూ మీకు జోహార్లు” చిత్రం షూటింగ్ తాజాగా మొదలైనట్టు తెలుస్తుంది.

అయితే ఈ రోజు ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్‌లో శర్వానంద్, రష్మిక మందన్నా పాల్గొన్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే శర్వానంద్ ప్రస్తుతం ఒకే ఒక జీవితం, మహాసముద్రం వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :