రష్మిక, కార్తీ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.

Published on Jul 29, 2019 7:13 pm IST

రష్మిక మందాన ప్రస్తుతం క్రికెటర్ లిల్లీగా థియేటర్లలో సందడి చేస్తుంది.హీరో విజయ్ దేవరకొండ జోడిగా ఆమె చేసిన “డియర్ కామ్రేడ్” తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా చెన్నై వెళ్లిన ఈ అమ్మడు ఆమె త్వరలో నటించనున్న తమిళ చిత్ర విశేషాలు పాత్రికేయులతో పంచుకున్నారు.

కార్తీ హీరోగా, భాగ్యరాజ్ కన్నా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు అని అన్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలు కావాల్సివుండగా,కొన్ని కారణాలతో ఆలస్యమైంది అని చెప్పారు. ఐతే ఆగస్టులో సెట్స్ పైకెళ్లనున్న ఈ చిత్రం కోసంఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అన్నారు. ఐతే ఈ మూవీలో మీ పాత్రేమిటో చెవుతారా అన్న ప్రశ్నకు మాత్రం ఆమె, ఆ విషయాన్నీ ఇప్పుడే చెప్పలేను అని అన్నారు. రష్మిక మందాన నటిస్తున్న మొట్టమొదటి డైరెక్ట్ తమిళ చిత్రం ఇదే కావడం గమనార్హం. తెలుగులో నితిన్ సరసన “బీష్మ”, మహేష్ ప్రక్కన “సరిలేరు నీకెవ్వరూ” చిత్రాలలో రష్మిక నటిస్తుంది.

సంబంధిత సమాచారం :