ఇంటర్వ్యూ : హీరో ‘గీతానంద్’ – ‘అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100’కి విడుదలైయ్యాక బజ్ వస్తే.. మా సినిమాకి విడుదలకి ముందే వచ్చింది !

ఇంటర్వ్యూ : హీరో ‘గీతానంద్’ – ‘అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100’కి విడుదలైయ్యాక బజ్ వస్తే.. మా సినిమాకి విడుదలకి ముందే వచ్చింది !

Published on Oct 22, 2018 8:30 PM IST

నూతన దర్శకుడు చంద్ర శేఖర్ కానూరి దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం ‘రథం’. యువతను ఆకట్టుకున్నే అంశాలతో వస్తున్న ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా ‘గీత ఆనంద్, చాందిని భాగవానని’ నటిస్తున్నారు. కాగా ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో ‘గీత ఆనంద్’ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

మీ ‘రథం’ గురించి చెప్పండి.. ఎలా నడుస్తోంది ? మీరెలా నడిపిస్తున్నారు ?

మీకు తెలిసి ‘రథం’ నడక ఈ మధ్యే మొదలైయింది. కానీ ఆ నడక వెనుక నాలుగైదు సంవత్సరాలు నా ప్రయత్నం ఉంది. 2013లో నా సినిమా జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ పూర్తీ సంతృప్తిని ఇచ్చే సినిమా చేయగలిగాను. సినిమా అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ‘అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100’ చిత్రాలకి విడుదల తరువాత బజ్ వస్తే.. మా ‘రథం’ చిత్రానికి మాత్రం విడుదలకి ముందే అంత బజ్ వచ్చింది. మా ‘రథం’ చిత్రబృందం నుంచి మేం నమ్మకంగా చెప్పే మాట.. ఈ సినిమా రొటీన్ గా అయితే ఉండదు. అందర్నీ ఆకట్టుకున్నే విధంగానే ఉంటుంది.

మీ ఫ్యామిలీ గురించి.. అలాగే మీ గురించి కూడా చెప్పండి ?

మా పేరెంట్స్ ది గుంటూరు అండి. నేను పుట్టింది కూడా అక్కడే. కానీ పెరిగింది చదివింది మొత్తం హైదరాబాద్ లోనే. ఎక్కువుగా నేను మా నాయనమ్మ దగ్గరే పెరిగాను. చిన్నప్పటినుంచి నాకు మూవీస్ మీద ఇంట్రస్ట్ ఉంది. ఫ్రెండ్స్ కి కథలు చెప్తూ ఉండేవాడ్ని. అలా నాకు ఫస్ట్ డైరెక్షన్ మీద ఆసక్తి కలిగింది. డైరెక్టర్ గా ఒక మూడు షార్ట్ ఫిల్మ్ స్ కూడా చేశాను. ఆ క్రమంలో యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ కలగడం.. దాంతో హీరోగా ‘తెలిసో తెలియకో’ అనే ఒక సినిమా చేశాను. అది అనుకున్న విధంగా రాలేదు. ఆ తరువాత ‘రథం’ సినిమా డైరెక్టర్ చంద్ర శేఖర్ కానూరి పరిచయం అయ్యారు. దాంతో మేం ‘పంతం’ అని ఓ సినిమాని మొదలు పెట్టాం.. అది పది రోజులు షూట్ చేశాక ఆగిపోయింది. ఇక అక్కడ నుంచి ఒక రెండు సంవత్సరాలు పూర్తిగా రాంగ్ ట్రాక్ లోకి వెళ్లిపోయి.. చివరకి ఎలాగోలా మళ్లీ మనం చేయాలి అనే కసితో చంద్ర శేఖర్ కానూరిగారు, నేను ఈ ‘రథం’ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం.

ఈ చిత్రంలో రొమాన్స్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తోంది ?

ఖచ్చితంగా అండి.. సినిమాలో రొమాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఎదో కావాలని ఫోర్స్ గా మేం రొమాన్స్ పెట్టలేదు. సినిమాలోని లవ్ స్టోరీకి అనుగుణంగానే.. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ పెట్టడం జరిగింది. అది మీకు సినిమా చుస్తే అర్ధమవుతుంది.

మీ సరసన నటించిన హీరోయిన్ బాగా నడిచినట్లు అనిపిస్తోంది. ఆమె గురించి చెప్పండి ?

ఈ సినిమాలో హీరోయిన్ పేరు చాందిని భాగవానని అండి. తను సిక్స్ ఇయర్స్ నుంచి హిందీలో సీరియల్స్ అవి చేస్తోంది. ఆల్ మోస్ట్ ఏడు షోస్ కి తను ఇప్పటివరకు లీడ్ రోల్ ప్లే చేసింది. కానీ తనకి ఇది మొదటి సినిమా.. నిజంగా తను చాలా బాగా చేసింది. తెలుగు అర్ధం చేసుకుని.. నేర్చుకొని మరి నటించింది.

ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలు చూస్తుంటే.. ఈ చిత్రం పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో జరుగుతున్నట్లు అనిపిస్తోంది. నిజమేనా ?

లేదండి. సినిమా మొదలైయ్యేది పల్లెటూరి నేపథ్యంలో అయినా.. తరువాత చాలా ట్రావెల్ ఉంటుంది. అంటే హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ ఇద్దరూ స్టూడెంట్స్.. అలా కాలేజీ బ్యాక్ డ్రాప్ ఉంటుంది, సిటీ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అలాగే పల్లెటూరి నేపథ్యం కూడా ఉంటుంది.

మీకు డైరెక్షన్ ఇంట్రస్ట్ అన్నారు. దాంతోనే షార్ట్ ఫిలిమ్స్ కూడా డైరెక్ట్ చేశారు. మరి భవిష్యత్తులో మిమ్మల్ని డైరెక్టర్ గా చూడొచ్చా ?

ఏమోనండి.. భవిష్యత్తులో చేస్తానేమో తెలీదు. ప్రస్తుతానికి అయితే డైరెక్షన్ ఆలోచనలు అస్సలు ఏమీ లేవు. పూర్తిగా నటన పైనే దృష్టి పెట్టాను.

ప్రొడ్యూసర్ కి ఇది మొదటి సినిమానా ?

మొదటి సినిమానే. ఆయనకి కొన్ని బిజినెస్ స్ ఉన్నాయి. అయితే ఇంతకు ముందే ఒకటి రెండు ప్రాజెక్ట్ లు చేద్దామని చూశారు. అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత మా కథ విన్నాకా చాలా ఇంప్రెస్ అయి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు.

మీ తదుపరి చిత్రాలు గురించి చెప్పండి ?

ఇంకా ఏవి ఫైనల్ అవ్వలేదండీ. కొని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏవైనా ‘రథం’ సినిమా రిలీజ్ అయిన తరువాత.. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు