సైరా క్లైమాక్స్ కోసం రత్నవేలు భారీ పరికరాన్ని ఉపయోగిస్తున్నాడు !

Published on Oct 15, 2018 5:45 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’ ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈలాంగ్ షెడ్యూల్లో సినిమాకు కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. భారీ యుద్ధ సన్నివేశాల నేపథ్యంతో కూడిన ఈ క్లైమాక్స్ ను చిత్రీకరించేందుకు కెమెరామెన్ రత్నవేలు ఒక భారీ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ల ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్న ఈ సన్నివేశాలు చిత్రానికి హైలైట్ కానున్నాయని సమాచారం. ఇక ఈ షెడ్యూల్లో చిరు తోపాటు , విజయ్ సేతుపతి , సుదీప్ , జగపతి బాబు మొదలైనవారు పాల్గొంటున్నారు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈచిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :