భారీ ధరకు రవితేజ “రావణాసుర” పోస్ట్ థియేట్రికల్ రైట్స్!

భారీ ధరకు రవితేజ “రావణాసుర” పోస్ట్ థియేట్రికల్ రైట్స్!

Published on Jan 26, 2023 11:54 AM IST

మాస్ మహారాజా రవితేజ ధమాకాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. అతని అభిమానులు ఇప్పుడు అతని రాబోయే ప్రాజెక్ట్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో రావణాసుర ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, రావణాసుర పోస్ట్ థియేట్రికల్ రైట్స్ ను జీ నెట్‌వర్క్‌ భారీ ధరకు సొంతం చేసుకుంది.

డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జీ5 వద్ద ఉండగా, శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్ష నగర్కర్, ఫరియా అబ్దుల్లా మరియు మెగా ఆకాష్ కథానాయికలుగా నటించారు. సుశాంత్ ప్రతినాయకుడు కాగా, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్ నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు