భారీ విరాళం ప్రకటించిన మాస్ మహారాజ్ రవితేజ..!

Published on Mar 29, 2020 4:00 pm IST

క‌రోనా కర్ఫ్యూ కార‌ణంగా షూటింగ్‌లు లేక ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలుగు సినీ కార్మికులను ఆదుకోవ‌డంలో భాగంగా హీరో ర‌వితేజ రూ. 20 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. త‌న వంతుగా ఈ మొత్తాన్ని క‌రోనా క్రైసిస్ చారిటీకి అంద‌జేస్తున్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఆయ‌న తెలిపారు. ఇవ్వ‌డ‌మ‌నే విష‌యం వ‌చ్చేదాకా తీసుకోవ‌డ‌మ‌నే ప్ర‌యోజ‌నం ఎప్ప‌టికీ పూర్తికాద‌నీ తెలిపిన ర‌వితేజ‌.. ఇది బాధ‌ను కొల‌వ‌డం కాదు, సినీ కార్మికుల అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో తోడ్పాటు మాత్ర‌మే అని పేర్కొన్నారు. క‌రోనా సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డానికి అంద‌రూ ఇంటిప‌ట్టునే సుర‌క్షితంగా ఉండాల‌ని కోరారు.

రవితేజ ప్రస్తుతం దర్శకుడు గోపి చంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ మూవీలో నటిస్తున్నారు. Ee. మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రవితేజ ఈ మూవీలో పోలీస్ రోల్ చేస్తుండగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More