రవితేజతో ఆ స్టార్ డైరెక్టర్ కన్ఫర్మ్ ?

రవితేజతో ఆ స్టార్ డైరెక్టర్ కన్ఫర్మ్ ?

Published on Feb 26, 2019 3:55 AM IST


వి.వి వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించటానికి ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోన్నప్పటికీ ఆ సినిమాకి స్క్రిప్ట్ మాత్రం సెట్ కావట్లేదు. కాగా తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా ఇప్పట్లో సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకంటే వినాయక్ తన కథను రవితేజకు వినిపించారట. రవితేజకు కూడా కథ బాగా నచ్చిందట.

కాగా వీరి సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక గతంలో వీరి కాంబినేషన్ లో ‘కృష్ణ’ సూపర్ హిట్ చిత్రం వచ్చింది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. మరి ఈ సినిమాతోనైనా వినాయక్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చిచూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు