మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ నెక్స్ట్ చిత్రానికి సంబంధించి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చేసేందుకు రెడీ అవుతున్నాడట.
గతంలో ఈ బ్యానర్‌లో ధమాకా, ఈగిల్, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు వచ్చాయి. అయితే ‘మిస్టర్ బచ్చన్’ భారీ నష్టాలను మిగిల్చగా, ఆ సమయంలో విశ్వ ప్రసాద్ చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయినప్పటికీ, ఈ ఇద్దరూ మళ్లీ కలిసి పని చేసే దిశగా స్క్రిప్ట్ చర్చలు కొనసాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో దర్శకుడు సురేందర్ రెడ్డి రవితేజకు ఒక ఐడియాను వినిపించగా, చర్చలు పాజిటివ్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనుండగా, కథను వక్కంతం వంశీ అందించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని, షూటింగ్‌ను 2026 రెండో భాగంలో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది వేచి చూడాలి.


