రవితేజ కెరీర్ లోనే ఈ సీక్వెన్స్.. బెస్ట్ కామెడీ సీక్వెన్స్ అట !

రవితేజ కెరీర్ లోనే ఈ సీక్వెన్స్.. బెస్ట్ కామెడీ సీక్వెన్స్ అట !

Published on May 26, 2022 10:55 AM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ధమాకా’ రాబోతుంది. ఈ సినిమాకి ‘డబుల్ ఇంపాక్ట్’… అనేది ట్యాగ్ లైన్. అయితే, ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇంటర్వల్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుందని.. ఫుల్ ఫన్ తో సాగుతూ భారీ నవ్వులను పంచబోతుందని తెలుస్తోంది. మెయిన్ గా రవితేజ కెరీర్ లోనే ఈ సిక్వెన్స్.. బెస్ట్ కామెడీ సీక్వెన్స్ అని టాక్ నడుస్తోంది.

ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు. రవితేజ రెండో పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందట. కిక్ సినిమాలోని రవితేజ మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తాడట. ఈ సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లిసందడి ఫేమ్ ‘శ్రీలీల’ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘శ్రీలీల’తో రవితేజ లవ్ ట్రాక్ సినిమాలోనే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు