‘డిస్కోరాజా’కి కొత్త రిలీజ్ డేట్ !

Published on Nov 7, 2019 7:12 pm IST

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మాణంలో రాబోతున్న తాజా చిత్రం ‘డిస్కోరాజా’. కాగా ఈ సినిమాని మొదట డిసెంబర్ 20న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే తాజాగా డిస్కో రాజాకి కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. 2020 జనవరి 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండటంతో ప్రచార కార్యక్రమాల్ని షురూ చేసింది టీమ్. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ , తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, సినిమాకు బాగా ప్లస్ అవుతున్నాయని చిత్రబృందం చెబుతుంది.

సంబంధిత సమాచారం :