ర‌వితేజ క్రాక్ రిలీజ్ పై చర్చలు అట !

Published on Jul 13, 2020 1:08 pm IST

మాస్ మ‌హారాజా ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో రానున్న సినిమా ‘క్రాక్’. కాగా ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ ఏమిటంటే, ఈ చిత్రాన్ని ఓటిటీ ప్లాట్‌ ఫామ్ పై విడుదల చేయడానికి మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ, తమ సినిమాను ఆన్‌ లైన్‌లో విడుదల చేయడానికి మేకర్స్ మంచి డీల్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.

కాగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమా ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ నటించిన డిస్కో రాజా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో రవితేజకి క్రాక్ కీలకం కానుంది. ఇక క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More