టీజర్ తో అలరించేందుకు సిద్దమవుతున్న రవితేజ


మాస్ మహారాజ రవితేజ కొంత కాలం గ్యాప్ తరువాత ప్రస్తుతం ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో నటిస్తున్నాడు. అభిమానులకు రవితేజ ఇండిపెడెన్స్ డే ట్రీట్ ఇవ్వనున్నాడు. ఆగష్టు 15 న రాజా ది గ్రేట్ చిత్ర టీజర్ విడుదల కానుంది. ఈ సినిమాలో రవితేజ కంటి చూపు లేని వ్యక్తిగా కనిపించబోతున్నాడు.ఇలాంటి పాత్రలో కనిపించడం రవితేజ కెరీర్ లో ఇదే తొలిసారి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదభరితంగా తెరకెక్కుతోంది. డార్జిలింగ్, హైదరాబాద్ లలో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.