ఈ సినిమా కూడా జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్న రవితేజ.!

Published on Oct 22, 2021 8:01 am IST

మాస్ మహారాజ రవితేజ అంటేనే స్పీడ్ అండ్ ఎనర్జీకి పెట్టింది పేరు.. అలా తన లాస్ట్ భారీ హిట్ “క్రాక్” తర్వాత మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్స్ ను రవితేజ లైన్ లో పెట్టుకున్నారు. ఇంకా అవి కంప్లీట్ అవుతుండగానే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని టేకప్ చేసి ప్రతీసారి ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ మూడు సినిమాలు షూట్ ప్రోగ్రస్ లో ఉండగా హిట్ దర్శకుడు త్రినాథ రావు నక్కిన తో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “ధమాకా” ను రీసెంట్ గా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు. అయితే ఇది జస్ట్ అనౌన్సమెంట్ తో ఆగలేదు ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ ని కూడా చిత్ర యూనిట్ కంప్లీట్ చేసేసినట్టుగా తెలుస్తుంది.

దీనిని బట్టి మాస్ మహారాజ్ ఎంత స్పీడ్ లో ఉన్నారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ షెడ్యూల్ లో ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల కూడా పాల్గొనడంతో ఇందులో ఆమెనే హీరోయిన్ అని కన్ఫర్మ్ అయ్యిపోయింది.

సంబంధిత సమాచారం :

More