మాస్ మహారాజ్ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ షురూ..!

Published on Oct 4, 2021 10:08 pm IST


మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ ఏడాది మొదట్లో ‘క్రాక్’ సినిమాతో రవితేజ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ “ఖిలాడీ” రిలీజ్‌కి సిద్దంగా ఉండగా, శరత్ మండవ దర్శకత్వంలో “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా షూటింగ్‌ని జరుపుకుంటుంది.

అయితే హిట్ సినిమాల దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన 69వ సినిమాను చేస్తున్నాడు. ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ని షురూ చేసింది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :