ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్న రాత్రే అవైటెడ్ ఫస్ట్ సింగిల్ అతి త్వరలో వస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ మొదటి పాట పై అకస్మాత్తుగా అప్డేట్ రావడానికి కారణం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అనే చెప్పాలి.
తను లేటెస్ట్ ఆస్ట్రేలియాలో ఇచ్చిన భారీ కాన్సర్ట్ లో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తను ఓ న్యూస్ చెప్పబోతున్నాను అని అందరికీ అతి త్వరలోనే దేవర సాంగ్ రాబోతుంది అని ప్రకటించాడు. దీనితో అక్కడ ఈ అప్డేట్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు అభిమానులు అయితే ఈ క్రేజీ కాంబినేషన్లో మొదటి సాంగ్ ని వినేందుకు ఓ రేంజ్ లో ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ భారీ చిత్రం పాన్ ఇండియా భాషల్లో ఈ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది.