రవితేజ సినిమా విడుదల తేది ఖరారు !

రవితేజ సినిమా విడుదల తేది ఖరారు !

Published on Mar 25, 2018 3:00 PM IST

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ లో రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తోన్న సినిమా నేల టికెట్. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 24న విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు.

ఫిదా సినిమాకు సంగీతం అందించిన శక్తీకాంత్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ మూవీ కి ముఖేష్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా నేల టికెట్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

తాజా వార్తలు