ఫ్యామిలి ఎమోషన్స్ తో రవితేజ !

రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజ నటిస్తోన్న సినిమా టచ్ చేసి చూడు, దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ మూవీ తర్వాత మాస్ మహారాజ్ దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించబోతోంది. డిసెంబరు చివరి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

కళ్యాణ్ కృష్ణ తీసిన రెండు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈ సినిమాపై మంచి అంచానాలు ఉన్నాయి. ఫ్యామిలి ఎమోషన్స్ క్యారీ చేస్తూ వినోదబరితంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. రవితేజ ఇదివరకు ఫ్యామిలి ఎమోషన్స్ ఉన్న సినిమాల్లో నటించినా ఈ సినిమా భిన్నంగా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు నిర్మాతలు.