రవితేజ “ఖిలాడి” నుంచి మరో అదిరిపోయే అప్డేట్..!

Published on Dec 28, 2021 10:33 pm IST

మాస్ మహారాజ రవి తేజ హీరోగా, మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీ హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’. పెన్ మూవీస్ మరియు ఏ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నా ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో పాటను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తాన్ని ఖరారు చేసింది. థర్డ్ సింగిల్ “అట్టా సూడకే” పాట ప్రోమోను రేపు సాయంత్రం 5:04 నిమిషాలకు రిలీజ్ చేస్తామని, అలాగే ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 31వ తేదీ ఉదయం 10:08 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :