‘ప్రేమమ్’ దర్శకుడితో రవి తేజ సినిమా ?
Published on Oct 30, 2016 10:39 am IST

ravi-teja-chandu-mondeti
మాస్ మహారాజ్ రవితేజ్ గత సంవత్సరం చేసిన ‘బెంగాల్ టైగర్’ తరువాత మరో కొత్త సినిమా సైన్ చేయలేదు. దీంతో చాలా మంది రవి తేజకు ఆఫర్లు తగ్గిపోయాయని రకరకాల రూమర్లు క్రియేట్ చేశారు. దానికి తోడు రవితేజ ఈ మధ్య డైరెక్టర్ బాబీతో చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోవడం కూడా ఆ రూమర్లకు మరింత బలాన్నిచ్చింది. కానీ తాజాగా సినీ వర్గాలు, రవి తేజ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ్ ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమాకి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

ఆ దర్శకుడు మరెవరో కాదు తాజాగా అక్కినేని నాగ చైతన్యతో ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్నందుకున్న చందూ మొండేటి. ఈ మధ్యే చందూ రవితేజకు స్టోరీ లైన్ చెప్పాడని అది నచ్చడంతో రవితేజ సినిమాకి ఒప్పుకుని పూర్తి కథను సిద్ధం చేయమని చందూ మొండేటికి చెప్పాడని తెలుస్తోంది. ఈ కథ చందు మొదటి సినిమా ‘కార్తికేయ’ తరహాలోనే భిన్నంగా ఉండనుందట. కానీ వార్తపై రవితేజ, చందూ మొండేటిల నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook