మాస్ మహారాజా ‘రావణాసుర’ టీజర్ కి సూపర్ రెస్పాన్స్

Published on Mar 7, 2023 12:09 am IST


మాస్ మహారాజా రవితేజ ఇటీవల ధమాకా మూవీతో పెద్ద సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న సినిమాల్లో యాక్షన్ థ్రిల్లర్ మూవీ రావణాసుర కూడా ఒకటి. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని రవితేజ టీమ్ వర్క్స్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్ పై రవితేజ, అభిషేక్ నామా కలిసి సంయక్తంగా ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. అను ఇమ్మానుయేల్, దక్షా నాగర్కర్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్స్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క పోస్టర్స్, సాంగ్స్ కి ఆడియన్స్, రవితేజ ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక నేడు ఈ మూవీ యొక్క అఫీషియల్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో అలరించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, రవితేజ పవర్ఫుల్ సీన్స్, డైలాగ్స్ తో రూపొందిన రావణాసుర టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ప్రస్తుతం ఈ టీజర్ 2 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో అలానే 104కె లైక్స్ తో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని దూసుకెళుతోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఏప్రిల్ 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :