రవితేజ మాస్ “క్రాక్”కు డేట్ లాక్ చేసేసిన దర్శకుడు.!

రవితేజ మాస్ “క్రాక్”కు డేట్ లాక్ చేసేసిన దర్శకుడు.!

Published on Dec 19, 2020 11:03 AM IST

KRACK

ప్రస్తుతం టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న పక్కా మాస్ పోలీస్ డ్రామా “క్రాక్”. తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రవితేజ లాస్ట్ సినిమా ప్లాప్ అయినప్పటికీ దీనిపై మరిన్ని అంచనాలు నెలకొనడం విశేషం. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ ఎప్పుడో థియేటర్స్ లోనే విడుదల చేస్తామని చెప్పేసారు.

అందుకు తగ్గట్టుగానే మిగిలి ఉన్న కాస్త షూట్ ను ఫినిష్ చేసేసి ఓ రిలీజ్ డేట్ ను అనుకున్నారు. దానినే ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేని రివీల్ చేసేసారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో జనవరి 14న విడుదల చేస్తున్నట్టుగా డేట్ ను లాక్ చేసేసారు. సో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ అప్పటికి రెడీ అయిపోవాల్సిందే ఇక. ఈ చిత్రంలో మరోసారి రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు