ప్రతి సీన్ గొప్పగా అనిపిస్తుంది – రవితేజ

ప్రతి సీన్ గొప్పగా అనిపిస్తుంది – రవితేజ

Published on Oct 16, 2023 8:00 AM IST

ravi 2

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ రాబోతుంది. ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన వ్యక్తినే ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ ‘శిల్పకళావేదిక’లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపై రవితేజ మాట్లాడుతూ .. “ఈ సినిమాలో ప్రతి సీన్ చాలా గొప్పగా అనిపిస్తుంది .. అందుకు కారణం ‘మధి’ ఫొటోగ్రఫీ. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. డైలాగ్స్ ను విపరీతంగా ఎంజాయ్ చేస్తారు” అని చెప్పాడు.

అలాగే రేణు దేశాయ్ గురించి రవితేజ మాట్లాడుతూ.. “రేణు దేశాయ్ గారు చాలా కాలం తరువాత కమ్ బ్యాక్ ఇచ్చారు. ఒరిజినల్ కేరక్టర్ కి చాలా దగ్గరగా ఆమె కనిపిస్తారు. ఆ పాత్రకి ఆమె చాలా కరెక్టుగా సరిపోయారు. ఆమె పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. డైరెక్టర్ వంశీ గురించి మాత్రం రిలీజ్ తర్వాత మాట్లాడతాను” అంటూ రవితేజ ముగించాడు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు