ఈసారి రవితేజ టార్గెట్ మూడు

Published on Feb 14, 2020 3:00 am IST

ఈ సంవత్సరం ‘డిస్కో రాజా’తో పలకరించిన రవితేజ ప్రస్తుతం గొపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే చిత్రం చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 8న విడుదల చేయనున్నారు. ఇది పూర్తయ్యేలోపే రమేష వర్మ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘క్రాక్’ పూర్తైన వెంటనే గ్యాప్ లేకుండా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు రవితేజ.

2020 పూర్తయ్యేనాటికి మూడు చిత్రాల్ని విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట రవితేజ. అందుకే కొత్త సినిమాను కూడా ఈ సంవత్సరం అఖరుకు విడుదల చేయనున్నారు. మొత్తానికి మాస్ మహారాజ ఈ ఏడాది మొత్తం ప్రేక్షకులకు అందుబాటులోనే ఉండాలని నిశ్చయించుకున్నారు.

సంబంధిత సమాచారం :