బ్రేకులే లేవంటున్న రవితేజ, శ్రీను వైట్ల !
Published on Jun 30, 2018 9:57 am IST

మాస్ మహారాజ రవితేజ, శ్రీను వైట్లలు కలిసి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మంచి వేగంతో జరుగుతోంది. రవితేజ, శ్రీను వైట్ల లాంగ్ బ్రేక్స్ లేకుండా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ ముగించిన టీమ్ ఈరోజుటితో హైదరాబాద్ షెడ్యూల్ ను కూడా పూర్తిచేయనుంది.

ఈ షెడ్యూల్లో ఇలియానా కూడ పాల్గొంటున్నారు. రవితేజ, ఇలియానలపై ప్రస్తుతం ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే టీమ్ యూఎస్ వెళ్లనున్నారు. సుమారు 6 సంవత్సరాలు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా ఈ సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook