డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన మాస్ మహారాజా “ధమాకా”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన మాస్ మహారాజా “ధమాకా”

Published on Jan 11, 2023 6:00 PM IST


మాస్ మహారాజా రవితేజ ధమాకా భారీ వసూళ్లను రాబట్టి ఎగ్జిబిషన్ రంగానికి భారీ ఊరటనిచ్చింది. నటుడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. త్రినధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ లీల కథానాయికగా నటించింది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ రన్ సాధించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైంది.

జనవరి 22న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ను అలరించనుంది. ఓటిటి ప్లాట్‌ఫారమ్ కొద్దిసేపటి క్రితం అధికారిక ప్రకటన ను ఇవ్వడం జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలో జయరామ్, సచిన్ ఖేడేకర్, రావు రమేష్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు