“పుష్ప”లో చాలా రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్.!

Published on Mar 12, 2021 10:01 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై పాన్ ఇండియన్ లెవెల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ భారీ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ గానే కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ను మేకర్స్ చెప్పారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో ఉండే ప్రతీ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ ను కూడా చాలా రఫ్ అండ్ రియలిస్టిక్ గా ప్లాన్ చేస్తున్నారట. ఇదే విషయాన్ని ఈ సినిమాకు పని చేసిన ఓ యువ స్టంట్ కొరియోగ్రాఫర్ చెప్పాడు. కేవలం తనకి ఇచ్చిన సీక్వెన్స్ మాత్రమే కాకుండా మిగతా ఫైట్ మాస్టర్స్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఓ రేంజ్ ఉంటాయని తెలిపాడు. సో పుష్ప లో మాత్రం యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ సుకుమార్ గట్టిగానే దట్టిస్తున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :