కుటుంబంతో కలిసి సందడి చేయనున్న రామ్ చరణ్ !
Published on Jun 13, 2018 8:34 am IST

రామ్ చరణ్ తేజ్, బోయపాటి శ్రీనులా కలయికలో ఒక హెవీ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం రేపటి నుండి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకోనుంది. సుమారు 15 రోజుల పాటు ఈ షూట్ జరగనుంది.

ఇందులో చరణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేయనున్నారు. కుటుంబ సభ్యులంటే సొంత ఫ్యామిలీ కాదు సినిమా ఫ్యామిలీ. ఈ షెడ్యూల్లో బోయపాటి చరణ్ అండ్ ఫ్యామిలీ మీద పలు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ కథానాయకిగా నటిస్తుండగా సీనియర్ నటి నటులు స్నేహ, ఆర్.ఎన్.రాజేష్, ప్రశాంత్, ప్రతినాయకుడు వివేక్ ఓబెరాయ్ పాల్గొననున్నారు. ఈ చిత్రం దసరాకు విడుదలకానుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook