‘ఆర్సి 12’ నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే !

Published on Oct 13, 2018 9:02 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం ఇటీవల అజర్బైజాన్లో జరిగిన లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుందని తెలిసిందే. ఇక ఈచిత్రం యొక్క తాజా షెడ్యూల్ వైజాగ్ లో జరుగనుంది. రేపు చిత్ర యూనిట్ వైజాగ్ రానుంది. అక్కడి సింహాచలం గుడిలో చిత్రానికి సంభందించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈషెడ్యూల్ తో దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తి అయినట్లే.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బోయాపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :