శ్రీదేవి భౌతికకాయం అప్పగింతలో జాప్యానికి గల కారణాలు !
Published on Feb 27, 2018 9:23 am IST

దుబాయ్ లో మరణించిన శ్రీదేవి పార్థివదేహాన్ని ఇండియాకు తీసుకురావడం ఇంకొంత ఆలస్యమయ్యేలా ఉంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసు కావడంతో విచారణ, తదితర ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉండటం వలెనే ఈ జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం అపస్మారకస్థితిలో బాత్‌టబ్‌లో పడి ఊపిరాడక శ్రీదేవి మరణించారని తెలగా దుబాయ్ పోలీసులు కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారికి అప్పగించారు.

ఆసుపత్రిలో కాకూండా బయట చనిపోవడం వలన అధికారికంగా నిర్వహించాల్సిన ప్రక్రియను చాలా ఉన్నయని, యూఏఈ ప్రభుత్వం నుండి ఇంకొక క్లియరెన్స్ రావాల్సి ఉందని భారత దౌత్యాధికారి నవదీప్ సూరి వెల్లడించారు. తమ అనుభవం ప్రకారం ఇలాంటి కేసులు తేలడానికి 2, 3 రోజుల సమయం పడుతుందని, వీలైనంత త్వరగా పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.

 
Like us on Facebook