మరో హైయ్య‌స్ట్ రికార్డ్ సాధించిన ‘సాహో’ !

Published on Feb 16, 2020 3:43 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన ‘సాహో’. ఆగస్టు 30వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా సాహో చిత్రాన్ని జన‌వ‌రి 26న హింది టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ చేశారు. అలాగే గ‌త ఏడాది డిసెంబ‌ర్ 8న ‘నెట్‌ఫ్లిక్స్ ఒటిటి’ లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద అదిరిపోయే స్పందన వస్తోంది. వ‌ర‌ల్డ్ టివి ప్రీవియ‌ర్ లో 128 ల‌క్ష‌ల మంది వ్యూవ‌ర్స్ తో హైయ్య‌స్ట్ రికార్డ్ సొంతం చేసుకుంది.

బ్రాడ్‌ కాస్ట్ ఆడియ‌న్స్ రీసెర్చ్ కౌన్సిల్ వారు ఈ సినిమాకి 128.20 ల‌క్ష‌ల మంది వ్యూవ‌ర్స్ ఇంప్రెష‌న్స్ వ‌చ్చాయ‌ని అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడు. టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More