స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ పాన్ ఇండియా ప్లాప్.!

స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ పాన్ ఇండియా ప్లాప్.!

Published on Apr 14, 2023 9:00 AM IST

కన్నడ సినిమా నుంచి పాన్ ఇండియా ఇండస్ట్రీ వద్ద భారీ హిట్ అయ్యిన సినిమాల్లో కేజీయఫ్ ఫ్రాంచైజ్ కూడా ఒకటి. మరి దీని కోవలోనే ఇదే షేడ్స్ తో వచ్చిన మరో భారీ పాన్ ఇండియా సినిమానే “కబ్జ”. రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా కిచ్చా సుదీప్ మరో కీలక పాత్రలో దర్శకుడు ఆర్ చంద్రు తెరకెక్కించిన ఈ చిత్రం ఫస్ట్ టీజర్ తో అయితే సెన్సేషనల్ హైప్ ని రేపింది. కానీ రిలీజ్ సమయానికి మాత్రం సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.

ఇక నెక్స్ట్ సినిమా కూడా కేజీయఫ్ లానే ఉండడంతో పాన్ ఇండియా వైడ్ ప్లాప్ గానే మిగిలిపోయింది. భారీ హంగులతో తెరకెక్కిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఒరిజినల్ కన్నడ సహా తెలుగు, తమిళ్, మళయాళ హిందీ భాషల్లో అయితే ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మరి అప్పుడు చూడని వారు ఇప్పుడు చూద్దామనుకుంటే ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు