విజయ్ చివరి సినిమాకి రికార్డు బిజినెస్!?

విజయ్ చివరి సినిమాకి రికార్డు బిజినెస్!?

Published on Jan 30, 2025 3:00 AM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే “జన నాయకన్”. మరి ఈ చిత్రం విజయ్ కెరీర్లో చివరి సినిమా కాగా ఈ చిత్రం తర్వాత విజయ్ రాజకీయాల్లోకి ఫుల్ బిజీగా మారనున్నాడు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇపుడు శరవేగంగా జరుగుతూ వస్తుంది.

ఇక రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి కూడా. అయితే ఈ చివరి సినిమాపై హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో తమిళ సినిమాలో ఏ సినిమాకి కూడా జరగని రికార్డు బిజినెస్ ఈ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్ లో జరిగినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో జన నాయకన్ కి ఏకంగా 75 కోట్లకి పైగా ఓవర్సీస్ థియేట్రికల్ డీల్ జరిగినట్టుగా తెలుస్తుంది.

దీనితో కోలీవుడ్ లో ఇది రికార్డు మొత్తం అన్నట్టుగా టాక్. మరి విజయ్ సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. లాస్ట్ టైం వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం కూడా మిక్స్డ్ టాక్ తో మంచి నంబర్స్ సాధించింది. ఇపుడు తన చివరి సినిమా కావడంతో హైప్ మరింత ఉన్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీ మొత్తాన్నే పెడుతున్నారని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు