తారక్ నెక్స్ట్ కి రికార్డు స్థాయి బడ్జెట్..?

Published on Jul 17, 2021 12:03 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి తో “RRR” అనే బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీని తర్వాత కూడా తారక్ నుంచి అదిరే లైనప్ సిద్ధంగా ఉంది. మరి వాటిలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ఒకటి ప్లాన్ చెయ్యగా మరొకటి సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఉంది. అయితే వీటిలో మాత్రం తారక్ ఫ్యాన్స్ నీల్ తో ప్రాజెక్ట్ కే ఆసక్తి చూపినా కొరటాల మాత్రం తన సినిమాని మరో లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

దీనిని కూడా పాన్ ఇండియన్ లెవెల్లోనే తెరకెక్కిస్తున్నారని తెలిసినా కూడా ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఈ చిత్రంపై ఉంది. మరి వాటన్నిటినీ దాటవేస్తూ ఈ సినిమాకి ఎస్టిమేట్ చేస్తున్న బడ్జెట్ లెక్క ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ చిత్రాన్ని సింపుల్ గా 180 నుంచి 200 బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు నయా టాక్. అలాగే ఈ సినిమాపై మరింత సమాచారం రానున్న రోజుల్లో రానున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :