ప్రభాస్ మరో రికార్డ్ కొట్టాడుగా !

Published on May 22, 2019 4:21 pm IST

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సోషల్ మీడియాలో గతం కంటే కొంచెం యాక్టివ్ అయ్యారు. ఈమధ్యే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఏప్రిల్ 17న ఆయన ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేయగా నెలరోజుల్లోనే ఫాలోవర్ల సంఖ్య 1.8 మిలియన్ చేరుకుంది. ఈ అకౌంట్ ద్వారానే ఆయన ‘సాహో’ కొత్త పోస్టర్‌ను నిన్న రిలీజ్ చేశారు.

అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానుల్ని పోస్టర్ బాగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాల్ని ఇంకాస్త పెంచింది. దీంతో పోస్టర్‌కు వేల సంఖ్యలో లైక్స్ దక్కాయి. 24 గంటలు గడిచేసరికి 7.96 లక్షల మంది పోస్టర్‌ను లైక్ చేశారు. ఇన్స్టాగ్రామ్ పరంగా ఒక తెలుగు పోస్టర్ ఈ స్థాయిలో లైక్స్ దక్కించుకోవడం ఇదే మొదటిసారి. సో రెబల్ స్టార్ ఇక్కడ కూడా ఓ రికార్డును క్రియేట్ చేశాడన్నమాట.

సంబంధిత సమాచారం :

More