దక్షిణాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం రజనీ ‘కాలా’. రజనీ గత చిత్రం ‘కబాలి’ అనుకున్నంతగా ఆడకపోవడంతో ఈ సినిమాపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారు రజనీ అభిమానాలు. పైగా పొలిటికల్ ఎంట్రీ తర్వాత వస్తున్న ఆయన మొదటి సినిమా ఇదే కావడంతో చిత్రాన్ని విశేషంగా భావిస్తున్నారు అభిమానులు.
కేవలం దక్షిణాదిలోనే కాకుండా అమెరికాలో కూడ సినిమా పెద్ద స్థాయిలో విడుదలవుతోంది. సుమారు 322 లొకేషన్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. 6వ తేదీ రాత్రి నుండి అధిక మొత్తంలో ప్రీమియర్ల ద్వారా చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఒక తమిళ సినిమా ఈ స్థాయిలో విడుదలవుతుండటం ఇదే మొదటిసారి. ఈ చిత్ర విడుదలను పురస్కరించుకుని తమిళనాడు, అమెరికాలోని కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు తన ఉద్యోగులకు మొదటిరోజు సినిమా చూసేందుకుగాను సెలవు ప్రకటించాయి.
- మోదీ బయోపిక్ లో విలన్ ఎవరంటే !
- నాని సినిమాలో ‘ఆర్ ఎక్స్ 100’ !
- క్రైమ్ కామెడీ నేపథ్యంలో వినూత్నంగా !
- డార్క్ కామెడీ సినిమాకి సెన్సార్ అయింది !
- అఖిల్ ఆ డైరెక్టర్ తో ఫిక్స్ అయినట్లే !