నెల్లూరులో రికార్డ్ స్థాయిలో రిలీజవుతున్న ‘అజ్ఞాతవాసి’ !

మెగా ఫ్యామిలీకి మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఏరియాల్లో నెల్లూరు జిల్లా కూడా ఒకటి. మెగా హీరోల సినిమాలకు అది కొంచెం ప్రత్యేకమైన ఏరియా అనే చెప్పాలి. ఇక చిరు, పవన్, చరణ్, బన్నీల సినిమాల విడుదలంటే పెద్ద హాంగామానే ఉంటుందక్కడ. ప్రస్తుతం 10వ తేదీన రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ యొక్క ‘అజ్ఞాతవాసి’ చిత్రానికైతే ఎప్పుడూ ఉండే హడావుడి కన్నా రెట్టింపు హడావుడి కనిపిస్తోంది.

దాదాపు సిటీలో ఉన్న అన్ని థియేటర్లలోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. అంతేగాక మొదటి రోజు రికార్డ్ స్థాయిలో దాదాపు 70 షోల వరకు ప్రదర్శింపబడనున్నాయి. ఇప్పటికే వరకు ఏ సినిమాకు ఈ స్థాయి విడుదల లభించలేదు. పైగా చిత్ర హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడవడంతో ఓపెనింగ్స్, కలెక్షన్స్ పై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల అర్థరాత్రి నుండే ప్రీమియర్ షోలకు సిద్ధమవుతున్నాయి థియేటర్ యాజమాన్యాలు.