బాలక్రిష్ణ సినిమాలో నటించడంలేదని క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ !
Published on Oct 16, 2017 9:24 pm IST

నందమూరి బాలక్రిష్ణ చేస్తున్న 102వ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా యొక్క క్లైమాక్స్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేసేశారు. ప్రముఖ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చేఏడాది రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఇప్పటీకే ముగ్గురు హీరోయిన్లు నయనతార, నటాషా దోషి, హరి ప్రియలు ఫైనల్ కాగా మరొక స్టార్ హీరోయిన్ రెజినా కూడా ఒక కీలక పాత్ర చేస్తుందని వార్తలొచ్చాయి.

నిన్నటి నుండి తెగ హడావుడి చేస్తున్న ఈ వార్తల పట్ల స్పందించిన రెజినా తాను బాలక్రిష్ణ, రవికుమార్ ల చిత్రంలో నటించడంలేదని తేల్చేసింది. సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారామె. దీంతో సాయంత్రం వరకు కొనసాగిన సస్పెన్స్ కు తెరపడ్డట్లైంది. ఇకపోతే చిరంతన్ భట్ సంగీతాన్ని అందివ్వనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook