రెజీనా, నివేదా షూట్ మొదలైంది !

Published on Jul 26, 2021 1:13 pm IST

దర్శకుడు సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో రానున్న సినిమా ‘శాకినీ- ఢాకినీ’(వర్కింగ్ టైటిల్). కాగా ఈ సినిమా మార్చిలో మొదటి షెడ్యూల్ షూట్ పూర్తి చేసి, తాజాగా తుది షెడ్యూల్ షూట్ ను తిరిగి ప్రారంభించింది. మొత్తం చిత్రీకరణ ఆగస్టు చివరి నాటికి ముగుస్తుందట. కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.

కాగా యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందనున్న చిత్రానికి దగ్గుబాటి సురేశ్‌ బాబు, సునీత తాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఇద్దరు నాయికల పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, రెజీనా కసాండ్ర తమ పాత్రల కోసం కొరియన్ యాక్షన్ కొరియోగ్రఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నారట.

అయితే, ‘రణరంగం’ ఆశించిన స్థాయిలో ఆడక పోయే సరికి సుధీర్ వర్మకు ఈ సినిమా కీలకంగా మారింది. మరి ఈ సినిమాతో కూడా హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :