ఈ సమ్మర్ కి సర్కారు వారి పాట మాస్ జాతర…రిలీజ్ డేట్ పై నేడు ప్రకటన!

Published on Nov 3, 2021 1:13 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా డైరక్టర్ పరశురాం దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జీ. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ ల పై ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం సరికొత్త రిలీజ్ డేట్ ను నేడు సాయంత్రం 4:05 గంటలకు ప్రకటించనున్నారు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1, 2022 కి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ సమ్మర్ కి సర్కారు వారి పాట తొలి చిత్రం అని తెలుస్తోంది. ఈ చిత్రం లో మహేష్ స్టైలిష్ లుక్ మరియు మాస్ లుక్ లకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం తో మహేష్ మరొక బ్లాక్ బస్టర్ కి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మొదటి సారి గా మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.

సంబంధిత సమాచారం :