రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఫీల్ గుడ్ మూవీ “డియర్ మేఘ”

Published on Aug 18, 2021 2:15 pm IST


ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ కి అనేక సినిమాలు రెడీ అవుతున్న సంగతి మనం చూస్తున్నాము. మరి ఇప్పుడు వాటిలో లేటెస్ట్ చిత్రం మరొకటి కూడా యాడ్ అయ్యింది. యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ హీరోయిన్ గా ఆదిత్ అరుణ్ హీరోగా నటించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రం “డియర్ మేఘ”.

కన్నడ చిత్రం “దియా” కి రీమేక్ గా తెలుగులో దర్శకుడు సుశాంత్ రెడ్డి తెరకెక్కించారు. ఇటావేళ పాటలు ప్రమోషన్స్ తో మంచి బజ్ ను తెచ్చుకుంటున్న ఈ చిత్రం కూడా తమ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే సెప్టెంబర్ 3వ తేదీన రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేశారు.

ఇక ఈ చిత్రానికి హరి గౌర సంగీతం అందించగా ఆర్గుణః దాస్యన్ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మాణం వహించారు. మరి కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే వచ్చే సెప్టెంబర్ 3 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :