సుధీర్ బాబు సినిమా విడుదల తేది ఖరారు !
Published on Mar 11, 2018 2:33 am IST

‘స‌మ్మోహ‌నం’ అంటే మంత్ర‌ముగ్ధుల‌ని చేసే ఒక అంద‌మైన ఆక‌ర్ష‌ణ‌. సుధీర్ బాబు హీరోగా అదితి రావ్ హైద్రి హీరో హీరొయిన్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పీజీ విందా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

యువతకు నచ్చే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆద్యంతం హాస్యం, సజీవమైన కుటుంబ బంధాలు, ఉద్వేగ భరిత సన్నివేశాలు ఉండబోతున్నాయని సమాచారం. సుధీర్ బాబు కెరిర్ లో ఈ సినిమా మంచి హిట్ చిత్రంగా నిలవబోతోందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ చిత్రం తరువాత సుధీర్ బాబు నిర్మాతగా రూపొందించిన సినిమా విడుదల కానుంది. నాయుడు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తీస్తున్నాడు.

 
Like us on Facebook