నాగ్ భక్తిరస చిత్రానికి ముహూర్తం కుదిరినట్టే ఉంది !

8th, December 2016 - 04:33:33 PM

om-namo
వరుసగా ‘మనం, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి’ వంటి వైవిధ్యభరితమైన సినిమాలతో ప్రేక్షకులకు కావాల్సిన కొత్తదనాన్ని పుష్కలంగా అందించిన సీనియర్ హీరో నాగార్జున అక్కినేని ప్రస్తుతం ‘ఓం నమో వెంకటేశాయ’ అనే భక్తిరస చిత్రాన్ని చేస్తున్నాడు. నాగ్ కెరీర్లో క్లాసిక్స్ గా నిలిచిన ‘అన్నమయ్య, శ్రీరామదాసు’ వంటి చిత్రాల్ని రూపొందించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండటం వలన ప్రాజెక్ట్ పై మంచి అంచనాలున్నాయి.

అయితే ఇన్నాళ్లు ఈ సినిమాలో విజువల ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటం వలన, వాటిని అత్యుత్తమంగా రూపొందించాలని సంకల్పించడం వలన ఆ పనులన్నీ పూర్తై సినిమా ఖచ్చితంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పడం నిన్నటి వరకూ సాధ్యం కాలేదు. కానీ ప్రస్తుతం ఈ పనులన్నీ చకచకా జరుగుతుండటం వలన సినిమాను ఫిబ్రవరి 10కి రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే అధికారిక సమాచారం వచ్చేదాకా ఇది కూడా ఖచ్చితమైన తేదీ అని చెప్పలేం. ఇకపోతే మహేష్ రెడ్డి నినిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.