విడుదలకు సిద్దమైన గోపీచంద్ 25వ సినిమా !

విడుదలకు సిద్దమైన గోపీచంద్ 25వ సినిమా !

Published on Feb 4, 2018 1:53 PM IST

హీరో గోపీచంద్ తన 25వ చిత్రాన్ని నూతన దర్శకుడు కె. చక్రవర్తి డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. మంచి సామాజిక సందేశంతో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను మే 18న రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రానికి ‘పంతం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఇందులో గోపీచంద్ కు జోడీగా మెహ్రీన్ ప్రిజాద నటిస్తుండగా జయప్రకాష్ రెడ్డి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్ర దర్శకుడు చక్రవర్తి గతంలో ‘పవర్, బలుపు, జై లవకుశ’ వంటి హిట్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు. ‘గౌతమ్ నంద, ఆక్సిజన్’ వంటి వరుస పరాజయాల్లో ఉన్న గోపీచంద్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని భావిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు