Spirit Report: ‘స్పిరిట్’ షూట్.. ప్రభాస్, ఓజి నటుని సీన్స్ తో మొదలు!

Spirit Report: ‘స్పిరిట్’ షూట్.. ప్రభాస్, ఓజి నటుని సీన్స్ తో మొదలు!

Published on Dec 15, 2025 10:00 PM IST

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “స్పిరిట్” (Prabhas Spirit) కూడా ఒకటి. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఇటీవల మెగాస్టార్ ప్రెజెన్స్ తో ఆరంభం అయ్యింది. ఇక ఇలా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమా మొదలు కానే వచ్చింది. తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం షూటింగ్ ఎప్పుడు నుంచి మొదలు కానుంది, ఎన్ని రోజులు ఎవరితో సీన్స్ అనేది తెలుస్తుంది.

Spirit Shoot Update – ఈ 19 నుంచే స్టార్ట్.. ఎన్ని రోజులంటే?

స్పిరిట్ (Spirit) షూటింగ్ ని మేకర్స్ ఈ 19 నుంచే మొదలు పెట్టనున్నారట. మొత్తం 20 రోజుల షెడ్యూల్ గా దీనిని ప్లాన్ చేస్తున్నారట. సో స్పిరిట్ ర్యాంపేజ్ మొదలు కానుంది అని చెప్పాలి.

Prakash Raj Scenes with Prabhas – ‘ఓజి’ నటుడు.. ప్రభాస్ తో కీలక సీన్స్..

ఈ 20 రోజుల షెడ్యూల్ లోనే ప్రభాస్ పాల్గొననున్నాడట. అయితే ఈ సీన్స్ ప్రభాస్ ఇంకా రీసెంట్ లో ఓజి లో కనిపించిన వెర్సటైల్ నటుడు ప్రకాష్ రాజ్ తో సీన్స్ ని సందీప్ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఆల్రెడీ సినిమా వాయిస్ గ్లింప్స్ లోనే ప్రకాష్ రాజ్ తో సాలిడ్ అవుట్ పుట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరితోనే మొదలు కానుందట. ఈ మొత్తం 20 రోజులూ వీరిపై సీన్స్ ఉంటాయని టాక్.

ఇక ఈ భారీ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే తీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు