“హ్యాపీ ఎనిమిషిప్ డే” అంటున్న ఆర్జీవీ!

Published on Aug 1, 2021 8:06 pm IST


వివాదాల దర్శకుడు గా పేరొందిన రామ్ గోపాల్ వర్మ, ప్రతి అంశం పై తనదైన శైలి లో స్పందిస్తూ ఉంటారు. అయితే మరొకసారి ఇప్పుడు అదే తరహాలో నేడు స్పందించారు. నేడు ఫ్రెండ్ షిప్ డే కావడం తో సర్వత్రా ఫ్రెండ్ షిప్ డే పై వ్యాఖ్యలు, విషెస్ తెలపడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం మరొకసారి వెరైటీ గా స్పందించారు.

శత్రువులు మన బలాలను చాలా సీరియస్ గా తీసుకుంటారు అని అన్నారు. మరియు మన స్నేహితులు మన బలాల పై విశ్వాసం పోయే విధంగా చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు. హ్యాపీ ఎనిమి షిప్ డే అని వ్యాఖ్యానించారు. అయితే ఆర్జీవీ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు చర్చలు జరుపుతున్నారు. ఏవైనా ఇలా స్పందించడం లో ఆర్జీవీ కి ఆర్జీవీ నే సాటి అంటూ మరికొందరు అంటున్నారు.

సంబంధిత సమాచారం :