విజయ్ “లైగర్” మేకోవర్ పై ఆర్జీవీ ఇంట్రస్టింగ్ కామెంట్స్!

Published on Jul 19, 2021 7:25 pm IST

అర్జున్ రెడ్డి చిత్రం తో క్రేజీ హీరో గా మారిపోయారు విజయ్ దేవరకొండ. వరుస విజయాలు అందుకుంటూ టాలివుడ్ లో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ లైగర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ను పాన్ ఇండియన్ మూవీ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం పై వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలి లో స్పందించారు.

కరణ్ జోహార్ సమర్పణ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న లైగర్ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను చూసినట్లు తెలిపారు. అయితే టైగర్ మరియు లయన ల క్రాస్ ఓవర్ కంటే విజయ్ దేవరకొండ సూపర్ క్రాస్ ఓవర్ పవన్ మహేష్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే స్క్రీన్ పై దేవరకొండ లైగర్ గా చాలా గొప్పగా ఉన్నాడు అని వ్యాఖ్యానించారు. తను చూసిన స్టార్ హీరోలందరిలో ఈ రెండు దశాబ్దాల్లో విజయ్ లాంటి హీరోను చూడలేదు అంటూ చెప్పుకొచ్చారు. పూరి జగన్నాథ్ మరియు ఛార్మి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం :