‘లక్ష్మీస్’వర్మ బాబును వదిలేలా లేడుగా ?

Published on Mar 18, 2019 3:28 pm IST

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. కాగా ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్‌ విషయంలో సెన్సార్ బోర్డుతో కలిగిన ఇబ్బందులను పరిష్కరించుకున్న చిత్రబృందం, తమ సినిమాను బుధవారం సెన్సార్ క్లియరెన్స్ కోసం పంపనున్నారు.

కాగా మార్చి 22 న విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్, మార్చి 29వ తేదికి విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విలన్ గా చూపించడం.. పైగా సినిమాను ఎన్నికల సమయంలో విడుదల చేయాలనుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాను అడ్డుకోవాలని తెలుగు తమ్ముళ్లు తెగ ప్రయత్నిస్తున్నారు.

అయితే వర్మ మాత్రం బాబును వదిలేలా కనిపించట్లేదు.. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ఎన్నికలకు ముందే విడుదల చెయ్యాలని చూస్తున్నాడు. మరి తెలుగు తమ్ముళ్లు సినిమాని అడ్డుకోగలరో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More